AR Rahman: నటుడిగా రెహమాన్.. ఆ డైరెక్టర్ సినిమాతో వెండితెర ఎంట్రీ!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. దశాబ్దాలుగా తన అద్భుతమైన స్వరాలతో మాయ చేసిన ఈ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్’, తొలిసారిగా వెండితెరపై నటుడిగా కనిపించనున్నారు. ప్రభుదేవా (Prabhu Deva) హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మూన్‌వాక్’లో (Moonwalk) రెహమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రెహమాన్ (AR Rahman) సంగీత దర్శకుడిగా లేదా తన నిజ జీవిత పాత్రలో కాకుండా, ఒక...