ప్రభుత్వ ఆసుపత్రులా ప్రత్యక్ష నరక కూపాలా ?  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు " ప్రత్యక్ష నరకూపాలుగా " మారాయని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా ఫైర్ అయ్యారు. బుధ‌వారం దోమ‌ల‌గూడ‌లోని టిడిపి హైద‌రాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జ‌రిగిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ.... గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సామాన్య పేద ప్రజలు ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా పొందలేని దుస్థితిని ప్రభుత్వం సృష్టించిందని అన్నారు. ప్రభుత్వం...