తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు ‘సంక్షేమం’ అంటే తెలియ‌దు

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు 'సంక్షేమం' అంటే తెలియద‌ని, సాంస్కృతిక రంగానికి బడ్జెట్ కేటాయించ‌క‌పోవ‌డం చూస్తుంటే పాల‌కుల ప‌ట్ల‌ కళాకారుల‌కు ఎంత చిత్త‌శుద్ధి ఉందో అర్థం అవుతుంద‌ని ప‌లువురు వ‌క్త‌లు అన్నారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో టిపిఎస్‌కె, పిఎన్ఎం ల సంయుక్తాధ్వ‌ర్యంలో రౌండ్‌టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టిపిఎస్‌కె రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా మాట్లాడుతూ... తెలంగాణలో ఆట-పాట ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య అని... ఇక్కడ...