Addam News
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 11:19 am Posted by : Addam News

మాజీ కార్పొరేట‌ర్ బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో అర‌వింద్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

మాజీ కార్పొరేట‌ర్ బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో అర‌వింద్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

అర‌వింద్ కుమార్‌గౌడ్ రాజ‌కీయంగా ఉన్న‌త‌స్థాయికి ఎద‌గాలి

– మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 19, అద్దం న్యూస్ :     తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ‌లు, అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసారు. పేదలకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్‌ గౌడ్ మాట్లాడుతూ…. అరవింద్ కుమార్ గౌడ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ల ఆశయాల కనుగుణంగా పనిచేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ‌లో పార్టీ ప్రతిష్టను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు డి.చంద్రమోహన్ గౌడ్, నాయకులు బి.రాజు. జి. శంకర్ నాయుడు, ఉదయ్ కుమార్ గుప్తా, శుక్రవేది, గోపాల్. శంకర్ గౌడ్. పుల్లయ్య. సుబ్బయ్య. టిఎన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png