Addam News
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 1:32 pm Posted by : Addam News

కుప్పకూలిన ఇంగ్లాండ్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది.

ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌ (41 పరుగులు; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. గస్‌ అట్కిన్సన్‌ (28 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. జో రూట్‌ (0), బెన్‌స్టోక్స్‌ (16), జెమ్మీ స్మిత్‌ సహా మిగతా వారంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్‌ బౌలర్లలో మైఖేల్‌ నెసర్‌ 4, స్కాట్‌ బోల్యాండ్‌ 3, మిచెల్‌ స్టార్క్‌ 2, కామెరూన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌లో ఆసీస్‌.. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక ఓవర్‌కు వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (0*), స్కాట్‌ బోల్యాండ్‌ (4*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒక్క రోజులోనే 20 వికెట్లు పడటం గమనార్హం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png