శ్రీ భవాని శంకర దేవాలయంలో అన్నపూర్ణా దేవి అలంకరణలో అమ్మవారు
ముషీరాబాద్, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ డివిజన్లో 400 ఏళ్ల చరిత్ర ఉన్న దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో మంగళవారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన జరిగింది. ఈ పూజలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...