ATMs: దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య.. కారణం ఏంటంటే?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దేశంలో డిజిటల్ విప్లవం, ముఖ్యంగా యూపీఐ (UPI) వినియోగం పెరగడంతో ఏటీఎంల (ATMs) అవసరం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన తాజా నివేదికలో వెల్లడించింది. జనం ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడటంతో నిర్వహణ ఖర్చులు భరించలేక బ్యాంకులు ఏటీఎంలను మూసివేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 2,53,417గా ఉన్న ఏటీఎంల (ATMs) సంఖ్య, 2025 మార్చి నాటికి 2,51,057కు పడిపోయింది. ఇందులో ప్రైవేట్...