బంగ్లాదేశ్‌లో దారుణం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితుల మధ్య మైనారిటీల భద్రతపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా రాజ్‌బరి జిల్లాలో అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ అనే హిందూ యువకుడిపై స్థానికులు మూకదాడి చేయగా, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రాజ్‌బరి జిల్లాలోని పంగ్షా సర్కిల్ లో బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేయగా, గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అమృత్ మరణించాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం సామ్రాట్ తన అనుచరులతో కలిసి గ్రామంలోని షాహిదుల్ ఇస్లాం అనే...