సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో సైబ‌ర్ నేరాల పై అవ‌గాహ‌న

హైదరాబాద్, న‌వంబ‌ర్ 15, అద్దం న్యూస్ :   సైబర్ నేరాల పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం శ‌నివారం హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో జ‌రిగింది. అవేర్నెస్ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు, డిఐ న‌దీమ్‌, చిక్క‌డ‌ప‌ల్లి డిఐ శంక‌ర్‌, ఎస్ఐ క‌రీమ్‌, న‌గ‌ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్ పైన క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఎలాంటి ఓటీపీలు కానీ,...