డ్రగ్స్, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
తార్నాక, నవంబర్ 17, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి నిర్మూలనతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గొరంట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అనేక నష్టాలు ఎదురవుతాయని...