Addam News
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 7:03 pm Posted by : Addam News

అంగన్‌వాడి కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్లు అందజేసిన బండ కార్తీక చంద్రారెడ్డి

తార్నాక, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా తార్నాకలోని లంబాడీ బస్తీ అంగన్‌వాడి కేంద్రానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. సేవా సంకల్ప అభియాన్ ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను గుర్తించి, సాధ్యమైన మేరకు సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమానికి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులు, సిబ్బందికి సౌకర్యం కల్పించేందుకు ఫ్యాన్లను వితరణ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.