ఫిన్లాండ్‌లో అదృశ్యమైన మనీదీప్ తల్లిదండ్రులను ప‌రామ‌ర్శించిన బండారు ద‌త్తాత్రేయ‌

ఫిన్లాండ్‌లో అదృశ్యమైన మనీదీప్ రెడ్డి తల్లిదండ్రులను ప‌రామ‌ర్శించిన బండారు ద‌త్తాత్రేయ‌ వనస్థలిపురం, జూలై 13, ( అద్దం న్యూస్ ) :    ఫిన్లాండ్‌లో 2026 మే 6వ తేదీ నుంచి అదృశ్యమైన బి.టెక్ విద్యార్థి గుజ్జా మనీదీప్ రెడ్డి తల్లిదండ్రులు ముత్యం రెడ్డి, మమతా రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమ‌వారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం వైదేహినగర్ కాలనీలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన తాజా పరిణామాల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మనీదీప్‌ను గుర్తించి క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి...