Addam News
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 4:00 am Posted by : Addam News

పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌త్క‌రించిన బండారు ద‌త్తాత్రేయ‌

పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌త్క‌రించిన బండారు ద‌త్తాత్రేయ‌


హైదరాబాద్, ఆగ‌స్టు 08, అద్దం న్యూస్ :   పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్‌ బండారు ద‌త్తాత్రేయ శుక్ర‌వారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో స‌త్క‌రించారు. 2025 జులై 22వ తేదీన 5895 మీట‌ర్ల ఎత్తు ఉన్న ఉహురు శిఖ‌రాన్ని మ‌నీష్ యాద‌వ్ విజ‌య‌వంతంగా అధిరోహించారు. ఈ సంద‌ర్భంగా మ‌నీష్‌ను స‌న్మానించిన బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… మాస్టర్ మనీష్ యాదవ్ సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఎంత ఎత్తులో ఉన్నా కలలు కనే అవకాశం ఉందని మనందరికీ గుర్తు చేస్తూ, ఆయన తన జర్నీలో ఉన్నత శిఖరాలను, మరిన్ని అద్భుతమైన మైలురాళ్లను సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png