Addam News
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 2:45 am Posted by : Addam News

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన బండారు ద‌త్తాత్రేయ‌

హైద‌రాబాద్‌, జూన్ 23, ( అద్దం న్యూస్ ) :   భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు, మహోన్నత జాతీయవాది, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హైద‌రాబాద్ రాంన‌గ‌ర్ నివాసంలో జ‌రిగింది. ముఖ‌ర్జీ బ‌లిదాన్ దివ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసిన ద‌త్తాత్రేయ నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. భారతదేశ ఏకత్వం, అఖండత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ప్రధానులు ఉండరాదు అనే సిద్ధాంతంతో దేశ సమైక్యత కోసం పోరాడిన మహానేతగా డాక్టర్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోయారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దేశభక్తి, నిస్వార్థ సేవ, జాతీయ చైతన్యానికి వారి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ను రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను సాకారం చేసిందన్నారు. అలాగే దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని నిరూపిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారతదేశం గట్టి గుణపాఠం చెప్పిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png