Addam News
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 8:04 am Posted by : Addam News

స్వామి దయానంద సరస్వతికి నివాళుల‌ర్పించిన బండారు ద‌త్తాత్రేయ‌

స్వామి దయానంద సరస్వతికి నివాళుల‌ర్పించిన బండారు ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 12, అద్దం న్యూస్ :   స్వామి దయానంద సరస్వతి 202వ జయంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ నివాసంలో గురువారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్వామి ద‌యానంద స‌ర‌స్వ‌తి చిత్ర పటానికి పూల‌మాల‌లేసి ద‌త్తాత్రేయ నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… స్వామి దయానంద సరస్వతి భారత సమాజాన్ని అజ్ఞానం నుంచి జ్ఞాన మార్గంలో నడిపించిన మహానుభావుడు అని, వేదాల వైపు తిరిగి చూడాలని పిలుపునిచ్చి, సామాజిక సంస్కరణలకు బాటలు వేశారన్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, జాతీయ చైతన్యం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ‌ని పేర్కొన్నారు. దేశ భక్తి, ధర్మం, నైతిక విలువలను ప్రజల్లో నాటిన స్వామిజీ ఆశయాలను నేటి యువత ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png