స్వామి దయానంద సరస్వతికి నివాళుల‌ర్పించిన బండారు ద‌త్తాత్రేయ‌

స్వామి దయానంద సరస్వతికి నివాళుల‌ర్పించిన బండారు ద‌త్తాత్రేయ‌ హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 12, అద్దం న్యూస్ :   స్వామి దయానంద సరస్వతి 202వ జయంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ నివాసంలో గురువారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్వామి ద‌యానంద స‌ర‌స్వ‌తి చిత్ర పటానికి పూల‌మాల‌లేసి ద‌త్తాత్రేయ నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... స్వామి దయానంద సరస్వతి భారత సమాజాన్ని అజ్ఞానం నుంచి జ్ఞాన మార్గంలో నడిపించిన మహానుభావుడు అని, వేదాల వైపు తిరిగి చూడాలని పిలుపునిచ్చి, సామాజిక సంస్కరణలకు...