కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టింది – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 21, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టిందని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ డివిజ‌న్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గ‌ల బ‌స్తీ ద‌వాఖానాను మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా బ‌స్తీ ద‌వాఖానాలో గ‌ల వైద్యులు, రోగుల‌ను క‌లిసి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... బ‌స్తీ ద‌వాఖానాలో స‌రైన మందులు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. బ‌స్తీ ద‌వాఖానాలో ప‌ని చేస్తున్న...