బన్సీలాల్ పేట్, అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) :
బన్సీలాల్పేట్లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు పిసిసి ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్సీలాల్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనసూయ, విజయ్ కుమార్, పాండు గౌడ్, నారాయణ ల ఆహ్వానం మేరకు ముందుగా దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ పాల్గొని వారికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.![]()