బన్సీలాల్ పేట్, అక్టోబర్ 15, ( అద్దం న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బన్సీలాల్పేట్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బీజేపీ నగర నాయకురాలు గడ్డం సుచరిత ఆధ్వర్యంలో బోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కవితా రెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ టి.రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వై.సురేష్ కుమార్, రాష్ట్ర నాయకులు ఎస్. రాజు, శ్రీనివాస్, నగర నాయకులు వై.శ్రీనివాస్ ముదిరాజ్, సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు మహేష్ రామంచ, ప్రధాన కార్యదర్శులు కిరణ్, పరమేష్, మహిళా నాయకులు విద్యా మోహన్, కె.అండాలు, హిమబిందు, రాజ్యలక్ష్మి, మమత పాల్గొన్నారు.![]()