పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలి – ఢిల్లీలో జరిగిన బిసి ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
అంబర్‌పేట్, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టడం జరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో వి.హనుమంతరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రం, లేబర్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, టీపిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి...