బీసీ ఆత్మగౌరవ భవనాలు రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి -రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : బీసీ ఆత్మగౌరవ భవనాలు కేవలం కుల సంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలకే పరిమితం కాకుండా బీసీల రాజకీయ చైతన్యానికి, హక్కుల సాధనకు, రాజ్యాధికార లక్ష్య సాధనకు కార్యాచరణ కేంద్రాలుగా మారాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిపై ఈ భవనాల్లో నిరంతరం చర్చలు జరగాలని సూచించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం...