‘వారి కోసం బీసీసీఐ మరిన్ని వన్డేలు నిర్వహించాలి’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత సీనియర్ ప్లేయర్లు.. రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఏడాది పొడవునా ఆటలో కొనసాగడానికి, బీసీసీఐ (BCCI) మరిన్ని వన్డేలను షెడ్యూలు చేయాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan) సూచించాడు. భారత జట్టు 2026లో తన తొలి వన్డేను జనవరి 11న న్యూజిలాండ్‌తో ఆడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇప్పటికే.. టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కేవలం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్నారు....