Addam News
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 3:58 am Posted by : Addam News

జ‌నాభా ప్రాతిప‌దిక‌న బీసీలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి » జ‌న‌వ‌రిలో ఛ‌లో ఢిల్లీ పేరిట మ‌హాధ‌ర్నా – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్

జ‌నాభా ప్రాతిప‌దిక‌న బీసీలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి

» జ‌న‌వ‌రిలో ఛ‌లో ఢిల్లీ పేరిట మ‌హాధ‌ర్నా

– డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలని డిమాండ్ చేస్తూ 2026 జ‌న‌వ‌రిలో ఛ‌లో ఢిల్లీ పేరిట మ‌హాధ‌ర్నాను నిర్వ‌హించ‌నున్న‌ట్లు డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు తెలిపారు. బుధ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ… భార‌త దేశంలో 151 కోట్లకు పైగా ఉన్న జనాభాలో 80 కోట్ల వ‌ర‌కు ఉన్న బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్నారు. కేంద్రంతో పాటు అన్ని ప్ర‌భుత్వాలు బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు మెంబ‌ర్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు చట్ట సభ వరకు దివ్యాంగుల‌కు రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలలో కేంద్రం ప్రభుత్వం నుంచి రూ.300 నుంచి రూ.3000 ల‌కు పెంచాల‌ని, దివ్యాంగుల‌కు రూ.10 వేల రూపాయ‌ల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేనిప‌క్షంలో దివ్యాంగులు తరుపున డిఎస్‌డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా త‌ర‌లివెళ్లి ఢిల్లీలోని జంతర్ మంత‌ర్ వ‌ద్ద‌ భారీ మహా ధర్నా నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png