సైబ‌ర్ నేరగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి – చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి

సైబ‌ర్ నేరగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి
– చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి

చిల‌క‌ల‌గూడ‌, సెప్టెంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :   సైబ‌ర్ నేరగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలని చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి తెలిపారు. చిలకలగూడ పోలీస్‌స్టేష‌న్‌ పరిధిలో సప్తమి గ్రాండ్ హోటల్ సమీపంలో జాన్సన్ గ్రామర్ హై స్కూల్ వద్ద సైబర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి చిల‌క‌ల‌గూడ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి హాజ‌రై వివిధ రకాల సైబర్ నేరాల గురించి, సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. ఎవరైనా సైబర్ నేరాల ద్వారా మోసపోతే వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 కి ఫోన్ చేసి తెలియజేస్తే జీరో ఎఫ్ఐఆర్‌ చేయబడుతుందని తెలిపారు. ఈ జీరో ఎఫ్ఐఆర్‌ సంబంధిత పోలీస్‌స్టేష‌న్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయబడుతుందని పేర్కొన్నారు. మీ డబ్బులు నేరస్తుల అకౌంట్‌లో హోల్డ్ అయితే లీగల్ ప్రాసెస్ ద్వారా మీ డబ్బులను తిరిగి మీ అకౌంట్ లోకి వచ్చే విధంగా చేస్తార‌న్నారు. ఈ కార్యక్రమంలో చిలకలగూడ ఎస్ఐ చంద్రయ్య, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page