Addam News
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 10:04 am Posted by : Addam News

బెట్టింగ్ యాప్ కేసు.. విచార‌ణ‌కు హాజ‌రైన యాంక‌ర్ శ్యామ‌ల‌

బెట్టింగ్ యాప్‌ల ప్ర‌మోట్ చేసిన కేసులో యాంక‌ర్ శ్యామ‌ల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే.

దాంతో న్యాయ‌స్థానం శ్యామ‌ల‌ను అరెస్టు చేయొద్ద‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా ఆమెను సూచించింది. ఇందులో భాగంగానే ఈరోజు శ్యామ‌ల పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. ఇక ఇదే కేసులో ఇప్ప‌టికే మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ రీతూచౌద‌రి, టీవీ యాంక‌ర్ విష్ణుప్రియ‌లు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం విదిత‌మే.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png