న్యాయం, స్వేచ్ఛ కోసం పోరాడిన భగత్‌సింగ్ నేటి తరానికి స్ఫూర్తి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

హైదరాబాద్, అద్దం న్యూస్ : బ్రిటిష్ నిరంకుశ పాలనా నుండి న్యాయం, స్వేచ్ఛ కోసం పోరాడిన భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు నేటి తరానికి స్ఫూర్తి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. భ‌గ‌త్‌సింగ్ నౌ జవాన్ భారత్ సభ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడటానికి యువతను, కార్మికులను, రైతులను ఏకం చేసి, స్వాతంత్య్రం పొందడానికి గొప్ప కృషి చేసాడని గుర్తు చేసారన్నారు. ఆదివారం భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల 94...