భోలక్‌పూర్ శ్రీ భవాని శంకర దేవాలయం రెనోవేషన్ కమిటీ ప్రమాణస్వీకారం
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయం రెనోవేషన్ కమిటీ ప్రమాణస్వీకారం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్‌గా సురేష్, సభ్యులుగా ఎం.శ్వేత, బి.నర్సింగ్‌రావు, జి.సాయిబాబా, పి.నీల్‌చందర్, సూర్య చంద్రశేఖర్, టి.క్రాంతి, కె.పరమేష్, పి.లక్ష్మణ్, వైపి.రాజు, ఎం.రాజు, మహేష్ కుమార్, నర్సింగ్ రావు, సురేందర్, కిషోర్, రంజిత్ గౌడ్ లు నియమితులయ్యారు....