Addam News
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 10:02 am Posted by : Addam News

టీమిండియాకు బిగ్ షాక్..

టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌కు తెలుగోడు దూరం!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం, తెలుగు తేజం తిలక వర్మ కడుపు సంబంధిత తీవ్రమైన గాయం కారణంగా రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న తిలక్ వర్మకు బుధవారం ఉదయం అకస్మాత్తుగా కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులు స్కాన్ నివేదికలను పరిశీలించిన తర్వాత తిలక్ వర్మకు అత్యవసరంగా సర్జరీ అవసరమని సూచించారు.

సర్జరీ తర్వాత కోలుకోవడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్వల్ప సమయంలో తిలక్ వర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమని తెలుస్తోంది. దీనివల్ల తిలక్ వర్మ న్యూజిలాండ్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ?

ఓ వైపు తిలక్ వర్మ గాయం ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. గతేడాది గాయపడిన శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను టీ20 జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png