Addam News
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 6:51 am Posted by : Addam News

bigg boss 9 telugu winner: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-9’ విజేత ఆయనే.. ట్రోఫీతో పాటు మరో సర్‌ప్రైజ్‌

bigg boss 9 telugu winner: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-9’ విజేత ఆయనే.. ట్రోఫీతో పాటు మరో సర్‌ప్రైజ్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్:   బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-9 అద్భుతమైన ముగింపును అందుకుంది. సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టి, ఎందరో సెలబ్రిటీలను వెనక్కి నెట్టి కల్యాణ్‌ పడాల విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.

సామాన్యుడి నుంచి విజేత వరకు..

కల్యాణ్‌ పడాల ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన ఒక CRPF జవాన్. దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్నప్పటికీ, ఆయనకు మొదటి నుంచీ వెండితెరపై మక్కువ ఉండేది. బిగ్‌బాస్ నిర్వాహకులు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ పోటీలో గెలిచి, కామన్‌మ్యాన్‌ కోటాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రూ.20 లక్షల గోల్డెన్ బ్రీఫ్‌కేస్‌ను ఆఫర్ చేసినా, దాన్ని కాదనుకుని గెలుపుపై నమ్మకంతో ముందడుగు వేశారు. సీజన్ ఆఖరి కెప్టెన్‌గా, అలాగే తొలి ఫైనలిస్ట్‌గా నిలిచి తన సత్తా చాటారు.

ఆటలో మలుపులు..

ప్రారంభంలో కల్యాణ్ ఆట అంతగా ఆకట్టుకోలేదు. సెలబ్రిటీల మధ్య ఆయనకు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే వచ్చేది. అయితే, సహ కంటెస్టెంట్ ప్రియ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్ తన వ్యూహాలను మార్చుకున్నారు. తనూజ, ఇమ్మాన్యుయేల్‌, డిమోన్‌ పవన్‌ వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొంటూ ప్యాషన్ తో ఆడారు.

విజేత భావోద్వేగం.

రూ.35 లక్షల ప్రైజ్‌ మనీతో పాటు.. షో స్పాన్సర్స్‌లో ఒకరైన ‘ రాఫ్‌ గ్రిప్పింగ్‌ ’ విజేత అయిన కల్యాణ్‌కు మరో రూ.5లక్షల క్యాష్‌ ప్రైజ్‌ను అందించారు. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్‌ కారును కూడా కల్యాణ్‌ సొంతం చేసుకున్నారు. ట్రోఫీ అందుకున్న అనంతరం కల్యాణ్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ” నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. హౌస్‌లో తనూజ, శ్రీజ, ప్రియ ఇచ్చిన మద్దతు మరువలేనిది. ముఖ్యంగా నా తల్లిదండ్రుల ఆశీస్సులే నన్ను ఇక్కడి వరకు చేర్చాయి ” అని ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ చరిత్రలో ఒక కామన్‌మ్యాన్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. తన నిజాయితీ, పట్టుదలతో కల్యాణ్ పడాల కేవలం ట్రోఫీని మాత్రమే కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png