నవీన్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, అల్పాహారం పంపిణీ
బాగ్‌లింగంపల్లి, నవంబర్ 8, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బాగ్‌లింగంపల్లిలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ నాయక్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల...