Addam News
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 11:04 pm Posted by : Addam News

ఎన్‌సీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్

తార్నాక, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) :   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్‌సీసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్ మరో రెండేళ్ల పాటు పునర్నియమితులయ్యారు. ఆయన పునర్నియామక ఉత్తర్వులను ఎన్‌సీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రైట్ రెవరెండ్ డాక్టర్ కె.సామ్ పాల్, రెవరెండ్. స్టీఫెన్ చిట్టిబాబు, రెవరెండ్. బ్రైటీ బ్యూలా అందజేశారు. గత ఐదేళ్లుగా ఎన్‌సీసీతో కలిసి పని చేస్తున్న బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్ తెలంగాణలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు నాయకత్వ విస్తరణ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, క్రైస్తవ సమాజ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు కృషి చేశారు. క్రైస్తవుల హక్కులు, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, అభివృద్ధి వంటి అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. పునర్నియామకంపై ఆయన ఎన్‌సీసీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర కమిటీకి, సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రెండేళ్లలో క్రైస్తవుల హక్కులు–సమాజ అభివృద్ధి–ఎన్‌సీసీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సేవా, అవగాహన, సంక్షేమ కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.