కవాడిగూడలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిఎన్.చారి ఆధ్వర్యంలో అంబేద్కర్‌నగర్ ఓం కాలనీ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ హాజరై పార్టీ జెండానావిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిజెపితోనే సామాన్యుడికి సమ న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో భవిష్యత్...