Addam News
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 11:55 am Posted by : Addam News

అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జి ప్రారంభోత్స‌వానికి త‌ర‌లివెళ్లిన బిజెపి నేత‌లు

హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ :   ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి సారధ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నిధుల‌తో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వంలో భాగంగా 266 కోట్ల నిధుల‌తో అంబ‌ర్‌పేటలో నిర్మించిన బ్ర‌డ్జి ప్రారంభోత్స‌వం సోమ‌వారం జ‌రిగింది. ఈ ప్రారంభోత్స‌వానికి కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రి, కిష‌న్‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌రై అంబ‌ర్‌పేట మున్సిప‌ల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారీగా బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివెళ్లారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు న‌వీన్ ఆధ్వ‌ర్యంలో వెళ్లిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్ బ‌స్సును ప్రారంభించారు. స‌భ‌కు త‌ర‌లివెళ్లిన వారిలో బిజెపి నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, సురేష్ రాజు, లక్ష్మణ్ యాదవ్, సాయి కుమార్, సత్యెందర్, యాదగిరి, కృష్ణ వేణి, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నీర‌జ్‌, నాయకులు, కార్యకర్తలున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png