Addam News
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 7:54 am Posted by : Addam News

స‌ద‌ర్ ఉత్స‌వాల్లో పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

స‌ద‌ర్ ఉత్స‌వాల్లో పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 23, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ‌లో ఓబిసి మోర్చ‌ మహంకాళి జిల్లా అధ్యక్షుడు సలంద్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీనగర్ యువమోర్చా నాయకుడు సంపత్ యాదవ్, రాంనగర్ డివిజన్‌లో రవి కుమార్ యాదవ్, లడ్డు యాదవ్, పలువురు యాదవ సోదరులు ఘనంగా నిర్వహించిన “సదర్ పండుగ” వేడుకలకు ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. యాదవ సేనా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆహ్వానం మేరకు నారాయణగుడా, వైఎంసిఎ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక నుండి విచ్చేసిన దున్నపోతుల విన్యాసాలను విన‌య్ కుమార్ తిలకించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, దినేష్, క్రాంతి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png