Addam News
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 9:53 pm Posted by : Addam News

భార‌త సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకు పుట్టిందే బిజెపి – బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు గ‌డ్డం న‌వీన్‌

 

భార‌త సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకు పుట్టిందే బిజెపి
– బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు గ‌డ్డం న‌వీన్‌

హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్   భార‌త సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకే బిజెపి ఆవ‌ర్భ‌వించింద‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు గ‌డ్డం న‌వీన్ అన్నారు. బిజెపి 46వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఆదివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ కృష్ణాన‌గ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి గ‌డ్ం న‌వీన్ ముఖ్య అతిథిగా హాజ‌రై పార్టీ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా గ‌డ్డం న‌వీన్ మాట్లాడుతూ… భార‌తీయ జ‌న‌తా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించ‌బ‌డింద‌న్నారు. అప్ప‌టి నుంచి పార్టీని దేశంలోని ప్ర‌జ‌లంద‌రూ ఆద‌రిస్తున్నార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియర్ నాయకులు బాలకృష్ణ, కత్తి లక్ష్మీనారాయణ, బాలయ్య, బాబు గౌడ్, రఘుపతి, రాజు, మహేష్, జై వీర్, నరేష్, ఎం.సత్యనారాయణ, పి.రాకేష్, ఎన్.రాకేష్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png