Addam News
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 10:37 pm Posted by : Addam News

నూతన గౌడ సంఘం ఆధ్వ‌ర్యంలో బొమ్మగాని ధర్మ భిక్షం వ‌ర్థంతి

హైదరాబాద్, అద్దం న్యూస్ తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నిరంతర ప్రజా సేవకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసన సభ్యులు, రజాకార్ల గుండెల్లో నిప్పులు చెరిగిన స్వాతంత్య్రం సమర యోధులు, నిజాయితీకి నిలువెత్తు రూపం ప్రజల మనిషి బొమ్మగాని ధర్మ భిక్షం వర్ధంతి నూతన గౌడ సంఘం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగింది. బుధ‌వారం హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలో సర్ధార్ పాపన్న ప్రాంగణంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉడుతల బాలకృష్ణ గౌడ్ హాజ‌రై ధర్మ భిక్షం చిత్ర ప‌టానికి పూల‌మాలలేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ప్రతి వాడలో, ప్రతి గ్రామములో బహుజనులందరూ ధర్మ భిక్షం వ‌ర్థంతిని ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలికట్టె ఆనంద్ గౌడ్, చర్లపల్లి కిరణ్ గౌడ్, లోడ శ్రీనివాస్ గౌడ్, ప్రదీప్ గౌడ్, హిమగిరి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ధనుంజయ గౌడ్, అంజా గౌడ్, సారా వెంకటేష్ గౌడ్, సిద్దగోని సుదాకర్ గౌడ్, మహిళా నాయకురాలు దీపా గౌడ్, మిట్ట వాణి గౌడ్, లికిత గౌడ్, రజిని గౌడ్, మమతా గౌడ్, స్వరూప గౌడ్, పోషాల సురేష్ గౌడ్, రాగవేందర్ గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png