Addam News
Newspaper Banner
Date of Publish : 21 July 2025, 2:22 am Posted by : Addam News

బాగ్‌లింగంప‌ల్లిలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో బోనాల వేడుక‌లు

బాగ్‌లింగంప‌ల్లిలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో బోనాల వేడుక‌లు

హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య పార్కు వ‌ద్ద ఎల్ల‌మ్మ దేవాల‌యంలో ఆదివారం బోనాల వేడుక‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, చిక్క‌డ‌ప‌ల్లి మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎల్ల‌మ్మ దేవాల‌యంలో బోనాల‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కుటుంబ స‌భ్యులు శివ‌క్రిష్ణ‌, అన్న‌పూర్ణ‌, వీణా త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png