మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు
మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు తార్నాక, ఆగస్టు 5, ( అద్దం న్యూస్ ) : ఆషాఢ మానపు బోనాల జాతరలో భాగంగా బుధవారం తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఐఎన్‌టియూసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తొలుత యూనియన్ ఆఫీసులోని అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పూజాధికాలను నిర్వహించినానంతరం ఊరేగింపుగా, పోతరాజుల నాట్య విన్యాసాలతో ఎంఎంసీ ఆవరణలో గల అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించారు....