చంద్రబాబు నాయుడి పై బిఆర్ఎస్ నాయ‌కుడు జ‌గ‌దీష్ రెడ్డి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు – తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా

హైద‌రాబాద్‌, మే 31, అద్దం న్యూస్ :             టిడిపి జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పై బిఆర్ఎస్ నాయ‌కుడు జ‌గ‌దీష్ రెడ్డి అవాక్కులు, చ‌వాక్కులు మాట్లాడుతున్నార‌ని, బూట‌క‌పు మాట‌లు క‌ట్టిపెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... బిఆర్ఎస్ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామన్నా భ్రమలో ఉన్నారని, పగటి కలలు...