ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన బిఆర్ఎస్ నాయ‌కులు

ముషీరాబాద్‌, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) : ద‌స‌రా పండుగను పుర‌స్క‌రించుకుని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ప‌లువురు నేత‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఎయిర్‌టెల్ రాజు దంప‌తులు, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, ప‌ద్మ దంప‌తులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స‌రోజ దంప‌తుల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారికి శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వారికి ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.