కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేశారు. మిర్చి దండలు వేసుకుని నిరసన ను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో సాగైన మిర్చి, ఈ సీజన్‌లో ధరల కారణంగా 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల సమస్యలు...