బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ విజయవంతం కావాలి
అంబర్‌పేట్, అద్దం న్యూస్ : ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో కెసిఆర్ అధ్యక్షతన నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవాలు మహాసభ విజయవంతం కావాలని అంబర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్ధ ముదిరాజ్ ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు భవాని మాస్ లీడర్, నరేంద్ర ముదిరాజ్, దశరథ్, సాయి, తరుణ్, కాశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.