Addam News
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 4:04 pm Posted by : Addam News

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

 

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

               ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్న డిసిపి శిల్ప‌వ‌ల్లి, సిఐ శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు

హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ :   గుర్తు తెలియని వ్యక్తి నీ నిందితులు దారుణంగా హత్య చేసిన ఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమ‌వారం జ‌రిగింది. స్థానికుల ద్వారా స‌మాచారాన్ని తెలుసుకున్న సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి, దోమ‌ల‌గూడ సిఐ శ్రీనివాస్‌రెడ్డిలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ హిమాయత్‌న‌గ‌ర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిఫ్ట్ లో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పడవేసి నిందితులు ఆకడి నుంచి పరారయ్యారు. హత్య గావించిన వ్యక్తి వివరాలు కానీ.. హత్యకు గల కారణాలు ఇంకా తెలియ‌లేద‌ని పోలీసులు తెలిపారు. క్లూస్ టైం సహాయంతో నిందుతుల కోసం గాలింపు చేపట్టామ‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png