Addam News
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 7:03 am Posted by : Addam News

Allu Arjun: బన్నీ-అట్లీ కాంబో సెన్సేషన్.. రూ.600 కోట్లకు డిజిటల్ రైట్స్?

Allu Arjun: బన్నీ-అట్లీ కాంబో సెన్సేషన్.. రూ.600 కోట్లకు డిజిటల్ రైట్స్ ?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ‘పుష్ప 2’ సంచలన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఈ జోష్‌లోనే బన్నీ తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో (Atlee) చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ (OTT Rights) కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 600 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ రైట్స్ రూ. 275 కోట్లకు అమ్ముడుపోగా, ఇప్పుడు అంతకు రెట్టింపు రేటు పలకడం బన్నీ (Allu Arjun) స్టామినాకు నిదర్శనం. ఒకవేళ ఈ డీల్ ఖరారైతే, భారతీయ సినిమా చరిత్రలోనే డిజిటల్ హక్కుల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టిస్తుంది.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు నటించబోతున్నారని, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని టాక్. 2027 వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం అట్లీ హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. ఈ వార్తలతో బన్నీ (Allu Arjun) అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png