Addam News
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 8:10 am Posted by : Addam News

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌ (Kovvur bridge)పై బుధవారం వేకువజామున ఓ ట్రావెల్స్‌ బస్సు (Bus Accident) పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌ బస్సును నిలిపివేశారు. అందులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. దాదాపు రూ.80 లక్షల మేర నష్టం జరిగిందని అంచనా వేసినట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png