ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌ (Kovvur bridge)పై బుధవారం వేకువజామున ఓ ట్రావెల్స్‌ బస్సు (Bus Accident) పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌ బస్సును నిలిపివేశారు. అందులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని...