పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారుగానీ... నిజానికి మహిళలు తమ రుతు సమయంలో ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాయామాలు చేయవచ్చు. ఆ టైమ్‌లో చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. అయితే మహిళలు తమ రుతు సమయంలో ఒక విషయంలో కొంత అప్రమత్తతతో ఉండాలి. అదేమిటంటే... రుతు సమయంలో వాళ్లు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో...