Addam News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:24 am Posted by : Addam News

ఇందిరాపార్క్ పార్కింగ్ వ‌ద్ద‌ కారు బీభత్సం…

ఇందిరాపార్క్ పార్కింగ్ వ‌ద్ద‌ కారు బీభత్సం…
మ‌హిళకు గాయాలు..
10 కి పైగా ద్విచక్ర వాహనాలు ధ్వంసం

క‌వాడిగూడ‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌సిద్ధి చెందిన ఇందిరాపార్క్ లో ఓ వ్య‌క్తి త‌న టీజీ 09 ఈ 1510 నంబర్ గల కారును పార్కింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు భీభ‌త్సాన్ని సృష్టించాడు. కారును పార్కింగ్ చేసే క్ర‌మంలో బ్రేక్ వేసే బ‌దులు యాక్సిల‌రేట‌ర్ తొక్క‌డంతో వేగంగా దూసుకెళ్లి 10కి పైగా ద్విచ‌క్ర వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో వాకింగ్ కు వ‌చ్చిన ఓ మ‌హిళ‌కు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి దోమ‌ల‌గూడ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న దోమ‌ల‌గూడ పోలీసులు స‌ద‌రు కారు న‌డుపుతున్న వ్య‌క్తిని, కారును పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసును పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.