మాదిగ దండోరా, మాల మ‌హానాడు కార్య‌కర్త‌ల‌పై పెట్టిన కేసుల‌ను ఎత్తివేయాలి – స‌ద‌స్సులో ప‌లువురు వ‌క్త‌లు

హైద‌రాబాద్‌, మే 25, అద్దం న్యూస్ :   మాదిగ దండోరా,మాల మ‌హానాడు కార్య‌కర్త‌ల‌పై పెట్టిన కేసుల‌ను ఎత్తివేయాలని ప‌లువురు వ‌క్త‌లు డిమాండ్ చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ స‌మ‌యంలో మాదిగ దండోరా, మాల మ‌హానాడు కార్య‌క‌ర్త‌ల‌పై పెట్టిన కేసుల‌ను ఎత్తివేయాల‌ని డిమాండ్ చేస్తూ బంధు సొసైటీ హైద‌రాబాద్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఆదివారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో స‌ద‌స్సు జ‌రిగింది. బంధు సొసైటీ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు ప‌ల్లేల వీర‌స్వామి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ భ‌ర‌త్ భూష‌ణ్‌, ప్రొఫెస‌ర్లు ముత్త‌య్య‌, న‌థానియేలు...