CBSE Exams rescheduled: ఆ పరీక్షల తేదీలు మారాయ్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్(CBSE Exams rescheduled)లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. టెన్త్, 12 తరగతుల విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ (CBSE) ప్రకటించింది. పాలనాపరమైన కారణాలతో ఈ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు పేర్కొంది. మార్చి 3వ తేదీన టెన్త్ విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను మార్చి 11వ తేదీకి; 12వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 10కి మార్పు చేస్తూ నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులేదని...